కాక్రోచ్ పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ మోదీపై సెటైర్!
- కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలు
- బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
- ఇన్‌స్టాలో 2.06 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీ
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ కనిపించారు. “బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి” అంటూ, ప్రధాని మోదీకి ఇష్టమైన పండుగా చెప్పుకునే మామిడి పండును తింటున్న వీడియోను పంచుకున్నారు. “కాక్రోచ్ ఈటింగ్ మ్యాంగోస్.. యమ్మీ” అంటూ #CockroachJantaParty, #justasking హ్యాష్‌ట్యాగ్స్‌తో దీనిని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రకాశ్ రాజ్‌తో పాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటీమణులు దియా మీర్జా, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఇప్పుడు సీజేపీ అకౌంట్లను ఫాలో అవుతున్నారు.
అభిజీత్ దీప్కే ప్రారంభించిన ఈ వ్యంగ్య ప్రచారం ఇంటర్నెట్లో ఒక చిన్న జోక్‌లా మొదలై ఇప్పుడు పెను తుపానులా మారింది. మే 16న లాంచ్ అయిన ఈ ఇన్స్టాగ్రామ్ పేజీ, కేవలం ఆరు రోజుల్లోనే ఏకంగా 20.6 కోట్ల ఫాలోవర్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.